Sunday, 26 April 2026 05:59:08 PM

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చెయ్యాలి

తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించిన CPI ML ప్రజాపంధా నేతలు

Date : 17 February 2023 02:07 PM Views : 484

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అర్హత కలిగిన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని వర్తింపజేసి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్గం తహసిల్దార్ కి సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CPI ML ప్రజాపంధా జిల్లా నాయకులు పెండ్యాల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక్క నిరుపేదలకు కూడా ఇల్లు కేటాయించలేదని అన్నారు. ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని హామీ ఇచ్చి గదినెక్కిన ఎనిమిది సంవత్సరాలలో కూడా ఒక్క ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవని. నేడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తిరిగి ఓట్ల కోసం సీట్ల కోసం డబుల్ బెడ్ రూమ్ పథకానికి దరఖాస్తు చేసుకోమని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అర్హత కలిగి ఉన్న నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం పథకాన్ని వర్తింపజేసి చేసి ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వృద్ధాప్య, వికలాంగ, ఒంటరి మహిళ, పెన్షన్ దరఖాస్తులు స్వీకరించాలని, మంజూరు చేయాలని కోరారు. మండలంలో రైతులందరికీ 24 గంటల విద్యుత్తును సరపరా చేసి ఆదుకోవాలన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ క్షేత్రస్థాయిలో మాత్రం వైపల్యం చెందిందని ఆరోపించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక మోటార్లు కాలుతున్న పరిస్థితి ఉందని ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం వెంటనే రైతన్నలని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా నేతలు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, ఆడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, భూషవేణి కృష్ణ, మార్త రాములు, నస్పూరి లక్ష్మి, ఆలకుంట ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :