Tuesday, 28 July 2026 12:12:19 PM

కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకలకు అడ్డుకున్న ప్రజలు..

Date : 23 November 2024 05:09 PM Views : 788

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సంగారెడ్డి జిల్లా : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలను విజయవంతం అయిన సందర్బంగా ప్రచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండల కేంద్రానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ చెందిన కళాబృందాలు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు గ్రామానికి రాగా ప్రజలు అడ్డుకున్నారు.ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ప్రభుత్వ పథకాలు అవసరం లేవు అంటూ వారిని గ్రామం నుంచి వెళ్లగొట్టారు. కాంగ్రెస్ టైంలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని,అసలు ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారని నిలదీశారు.దీంతో కళా బృందాలు చేసేదేమి లేక నిరాశగా అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :