Wednesday, 29 July 2026 08:26:02 AM

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోన్నకాంగ్రెస్...

పద్మ అవార్డుల విషయంలోనూ కాంగ్రెస్ నాయకులు రాజకీయం.... తమిళనాడు రాష్ట్ర కో-ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

Date : 28 January 2025 06:58 AM Views : 517

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీయే వ్యవహరిస్తోందని తమిళనాడు రాష్ట్ర కో-ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.గత రెండుమూడు రోజులుగా కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలు, ఫెడరల్ స్ఫూర్తి అనే విషయాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు..సోమవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ సబ్ కా శ్వాస్.. సబ్ కా వికాస్ నినాదంతో ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తూ వికసిత్ భారత్ టార్గెట్ గా ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత పదిన్నర సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.పేదరిక నిర్మూలన కోసం చర్యలు, రైతుల సంక్షేమం, యువత, మహిళల సంక్షేమం కోసం ప్రాధాన్యతనిస్తూ మోదీ ప్రభుత్వం పాలన అందిస్తున్నదన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అనేక రకాలుగా అవమానించి, రాజ్యాంగాన్ని అవమానపర్చిందన్నారు. అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిందని,సంవిధాన్ బచావో యాత్ర పేరుతో రాజకీయ క్రీడకు తెరలేపి, సమాజంలో అనేక బేధాభిప్రాయాలు సృష్టించేలా ఓటుబ్యాంకు రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని విమర్శించారు.పీఎంఏవై కింద దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్లకు పైగా ఇండ్లను నిర్మించి ఇచ్చి గృహనిర్మాణానికి ప్రాధాన్యమిచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే నన్నారు.అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ రాష్ట్ర ప్రభుత్వ స్కీములుగా ఫొటోలు పెట్టుకుని అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. తమిళనాడు, కర్నాటకలో కూడా అనేకసార్లు ఇలాగే వ్యవహరించారనిగృహ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులిస్తుంటే.. దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణాల కోసం నిధులిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి సడక్ యోజన, గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన వంటి పథకాలకు లక్షల కోట్ల నిధులు కేటాయిస్తోంది. దేశంలో పేదప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోందణి తెలిపారు.రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి. కాని కేంద్రమిచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం సబబు కాదు. కేంద్ర పథకాల అమలులో ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాగ్ధానభంగం చేసి వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు..రైతులను, యువకులను, మహిళలను.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.చివరికి పద్మ అవార్డుల విషయంలోనూ కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ అమరవీరుల అంశం, ఉద్యమ నేపథ్యాన్ని పద్మ అవార్డులకు అంటగడుతున్నారు. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.నియమనిబంధనలకు అనుగుణంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి , మందకృష్ణ మాదిగ వంటి వారికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేసింది.ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీయే వ్యవహరిస్తోంది.కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు.కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో వాల్మీకి స్కామ్‌లో రూ.90 కోట్ల అవినీతి జరిగింది. కుంభకోణం విషయంలో ఓ మంత్రి రాజీనామా చేశారు.అన్నింట్లో స్కాములతో టక్కుటమార విద్యలతో ప్రజలను మోసం చేస్తోంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు తప్పకుండా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించి, అనేకమంది జైలులో పెట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ప్రజలందరికీ తెల్సు.అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని మాటలు చెప్పడం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతగాక ప్రజా పరిపాలన పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి, కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఇలాంటి పోకడలను క్షమించరు.6 గ్యారంటీలు, 66 హామీలు, 400కి పైగా వాగ్ధానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :