ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : మహాశివరాత్రి పర్వదిన పురస్కరిఉంచుకొని సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో ని అంబర్ నగర్ లో మార్కండేయ దేవాలయం లో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా కన్నుల పండుగగా జరిగినది. ఈ వేడుకలో ఎదుగనిలతా, దేవేందర్ మరియు శ్రీ ఆట్ రాంచందర్ ఫ్యామిలీ పాల్గొని కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం కు ముందు గా సర్వదేవతల పూజా, రుద్ర హోమం లో మృత్యుంజయ మంత్రాన్ని జపించడం జరిగింది. చివరగా పూర్ణాహుతి నిర్వహించారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ ,స్వర్గం బాబు, వర ప్రసాద్, ఫ్రేం, బొమ్మ నరేంద్ర, జనరల్ సెక్రటరీ చిన్నకోట్ల సప్నా రాజ్ , గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం సెక్రటరీ బల్ల గీత, అలువేలు,శశికళ,పూల మారుతి,గోశిక శేఖర్, కల్లెపల్లి రాజు ,ఆనంద్ పాల్గొన్నారు చివరగా అన్నదాన కారుఅక్రమం నిర్వహించారు. మాట్లాడుతూ 11వ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియా ఇన్చార్జి బొమ్మ నరేంద్ర మాట్లాడుతూ11వ సంవత్సరాలుగా అంబర్ నగర్ లో మార్కండేయ దేవాలయం లో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనాలని,నిత్యం శివుడిని పూజిస్తే, సకల దోషాలు తొలగి, శుభం జరుగుతుందన్నారు. హాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం లో పాల్గొన్న ప్రతి వారికి రక్షణ ఉంటుందన్నారు.
Admin
Aakanksha News