ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ఎస్ఎల్బీసీ సంఘటన తెలంగాణ ప్రజానీకాన్ని కుదిపివేసిందని, వర్కర్స్ క్షేమ సమాచారాలు ఇంకా తెలియరాకపోవడం పట్లబీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మేల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండకు మంచి నీరు అందించాలని ఈ ఎస్ఎల్బీసీని ప్రారంభించారని,2004 నుంచి ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు.. కానీ వ్యయం పెరిగిందన్నారు.నల్గొండలో జలయజ్ఞం పేరుతో నిర్వహించిన చర్చా వేదికలో తాను ఇంజనీర్ నే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారుజేపీ అనే సంస్థకి ఈ ప్రాజెక్టును కట్టబెట్టారని విమర్శించారు.సబ్ కాంట్రాక్ట్ కోసం ఓ కాంగ్రెస్ నేత జేపీ సంస్థను ముప్పు తిప్పలు పెట్టారన్నారుటెన్ జన్ పత్ ఆదేశాలతో ఆ కాంగ్రెస్ నేతకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జేపీ సంస్థ తట్ట మట్టి తీయలేదు ఎనిమిది సంవత్సరాల తరువాత పనులు ప్రారంభించారు టీబియం ద్వారా పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే ఈ ప్రమాదం జరిగిందన్నారుటీబియం విధానం ఇక్కడ అనువైంది కాదని ముందే చెప్పాను కోమటి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఈ ప్రాజెక్టును నడిపిస్తున్నారుకాంగ్రెస్ నాయకులు నల్లగొండ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.జేపీ సమస్తకి డిల్లీ అండదండలు ఉండటం వల్లే జేపీ సంస్థకే మళ్లీ కట్టబెట్టారని ఆరోపించారు.కాంగ్రెస్ నాయకులు జేబు నింపుకునేందుకు ప్రాజెక్టుల డిజైన్ రూపకల్పన చేస్తున్నారుకోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం దాగి ఉందని,యమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందిహత్యలపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.కేంద్రం నుంచి అనేక శాఖల నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని టిలిపారు.రేవంత్ రెడ్డి ప్రకటనలు విలువైనవి కావు,కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారిపోతుంటే కేంద్రమంత్రిపై విమర్శలు చేస్తున్నారన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందనే అంశంపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News