ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ములుగు జిల్లా : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీసుల ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. వివరాల్లోకి వెళ్తే... అదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్, రమేష్ అనే ఇద్దరిని సుమారు రాత్రి 11.30 నిమిషాల సమయంలో సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరినీ ఒకే సమయంలో గొడ్డలితో నరికి చంపారు. అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై దాడులకు కారకులు అయ్యారని పలుమార్లు హెచ్చరించిన పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిందని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖ లో పేర్కొన్నారు.
Admin
Aakanksha News