ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : త్వరలోనే ఎమ్మెల్సీ స్థానాలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గురువారం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లడుతూ.. ఫిబ్రవరి 3న ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.కాగా, బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి పది వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు గడువు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఫిబ్రవరి 27న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఎన్నిక ప్రక్రియను మార్చి 8 వరకు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Admin
Aakanksha News