Sunday, 26 April 2026 05:55:59 PM

కార్మిక సమస్యల సాధనకై కార్మిక గర్జన....

భారత కార్మిక సంఘాల సమైక్య నాయకుల పిలుపు

Date : 22 July 2023 11:28 AM Views : 830

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఆగస్టు 4వ తేదీన భారత కార్మిక సంఘాల సమైక్య నాయకుల ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో కార్మిక గర్జనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు తోకల రమేష్, సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. 9 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు కాంట్రాక్టు కార్మికుల కోసం ఒక జీవో కూడా విడుదల చేయాలని వారు మండిపడ్డారు. సుమారు 2 లక్షల 50 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వెంటనే కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 4వ తేదీన కార్మిక గర్జన నిర్వహిస్తున్నామని ఈ గర్జనకు కాంట్రాక్టు కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఓడిస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆడెపు శంకర్, రాజేశ్వర్, గొల్లపల్లి చంద్రయ్య, దేవన్న, వెంకటేశం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :