Tuesday, 28 July 2026 04:44:45 AM

ప్రభుత్వ మాత శిశు సామాజిక వైద్యశాలలో ఉద్యోగుల ధర్నా

Date : 28 March 2023 12:17 PM Views : 788

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ మాత శిశు సామాజిక వైద్యశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పని చేసే 30 మంది కాంట్రాక్టు సిబ్బందికు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం 15,600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి ఒకే రకం దుస్తులు అందజేయాలని వారు తెలిపారు. అయితే గతంలో నెలకు 5వేల రూపాయలు జీతాలు ఇచ్చే వారని, వైద్యశాలలో పని చేస్తున్న సిబ్బందికి సమాన పనికి సమానంగా జీవో ప్రకారము వేతనాలు అందజేయాలని తెలియజేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :