ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖనిలోని ప్రభుత్వ దావఖానలో అనేక మంది రోగులు తమ అనారోగ్య కారణాల రీత్యా వైద్యం చేయించుకోవడానికి వచ్చి వైద్యం చేయించుకున్న అనంతరం వైద్యులు రాసిన మందులను ప్రభుత్వ దావఖానలోని ఫార్మసీలో తీసుకోవడానికి వెళ్తే అరకొర మందులు ఇచ్చి మిగతావి బయట కొనుక్కోవాలని చెప్పి ఆసుపత్రి సిబ్బంది పరోక్షంగా ఆసుపత్రి బయట ఉన్న మెడికల్ షాపుల వ్యాపారానికి అండగా నిలుస్తున్నారని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ మార్కపురి సూర్య ధ్వజమెత్తారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం కోసం వచ్చి చికిత్స అనంతరం మందులు తీసుకుందాం అనుకుంటే వారికి ఆసుపత్రి సిబ్బంది నుండి మొత్తం మందులు లేవు అంటూ చెప్పి ఒకటి రెండు మందులు ఇచ్చి మిగతావన్నీ బయట కొనుగోలు చేయాలని చెప్పి చెప్పడం దారుణమని అన్నారు. పేద ప్రజలు ఉచిత వైద్యంతో పాటు ఉచిత మందులు ఇస్తారని అనేక ప్రయాణాల ఖర్చులకు ఓర్చి ఆసుపత్రి చేరిన వారికి అక్కడ నిర్వేదం ఏర్పడుతుంది తప్ప వారికి పూర్తిస్థాయి మందులను అందించడానికి ఆసుపత్రి అధికారులు సిబ్బంది చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు ఎంతో గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేశామని మెడికల్ కళాశాల ను తీసుకొచ్చి 24 గంటల వైద్యంతో పాటు ఉచిత మందులు పంపిణీ చేస్తున్నామని ప్రచారంతో ఊదరగొడుతున్న ప్రజాప్రతినిధులు పేద రోగులకు మందులు పంపిణీ చేసే విషయంలో చిత్తశుద్ధి చూపించాలని మాటలు చెప్పడం కాదు చేతలతో రోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని మందులను తెప్పించి ప్రతి పేషెంట్ కు అన్ని మందులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు
Admin
Aakanksha News