ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని, నూతన బోర్డు నియమించిన తరువాతే పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. తెలంగాణలో ఒక్క ఉద్యోగ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని టిఎస్‌పిఎస్‌సి బోర్డును రద్దు చేయాలని నిరుద్యోగులు, అఖిల పక్షo, విద్యార్థి సంఘాలు అడిగితే బోర్డును ఎందుకు రద్దు చేయడం లేదో, దీని వెనుక ఉన్న అసలు దోషులు ఎవరో ముఖ్యమంత్రి మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు కోట్లాడి ఉద్యోగాలు సాధించు కోవాలని పిలుపునిచ్చారు. సడక్ బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన అఖిలపక్ష, విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నాయకులను, నిరుద్యోగులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News