Tuesday, 28 July 2026 01:56:18 PM

మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం...

క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.... జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్

Date : 28 March 2025 05:59 PM Views : 459

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చని, క్రీడలను ప్రోత్సహించడం అంటే భవిష్యత్ తరాలను నిర్మించడమేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈరోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న , 4 వ కియో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలకు అయన ముఖ్య అతిది గా హాజరు అయ్యారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, అన్ని వయసుల వారికి వర్గాల వారికి క్రీడలు ఎంతో అవసరమని రాష్ట్ర ప్రభుత్వము క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా మైదానాలను క్రీడాకారులు విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. బీసీ సంక్షేమ శాఖ & రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రీడల పై ఆసక్తి ఉంది కాబట్టే క్రీడలకు అధిక బడ్జెట్ కేటాయింపులు జరిగాయని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రీడా మైదానాల వైపు మళ్ళే దిశగా ప్రభుత్వము వివిధ క్రీడా కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు. శాసనమండలి సభ్యులు తెలంగాణ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కరాటే క్రీడకు తెలంగాణలో పల్లె పల్లెలో ఎంతో ఆదరణ ఉందని, అనేక మండల కేంద్రాల్లో కరాటే శిక్షణ కేంద్రాలు విరివిగా ఉన్నాయని ఆయన అన్నారు.,జాతీయ కరాటే ఛాంపియన్షిప్ దిగ్విజయంగా నిర్వహిస్తున్న తెలంగాణ లో భవిష్యత్తులో ఆసియన్ కరాటే ఛాంపియన్షిప్ కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిలాష అని , త్వరలోనే ఆసియన్ కరాటే ఛాంపియన్షిప్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మరిన్ని జాతి అంతర్జాతీయ పోటీలు హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్ని క్రీడా ఫెడరేషన్లు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని అన్నారు. గ్రామస్థాయి నుండి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ క్రీడా పోటీల నిర్వహణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి శ్రీమతి సోనీ బాలాదేవి, భారతక్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, ఒలంపియన్ బాక్సర్ నికత్ జరిన్, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అధ్యక్షులు భరత్ శర్మ కార్యదర్శి సంజీవ్ జాంగ్ర, కోశాధికారి బంకిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీర్తన్ వివిధ రాష్ట్రాల కరాటే అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :