Tuesday, 28 July 2026 08:09:14 AM

మహిళలకోసం 'మహాలక్ష్మీ' పథకం చారిత్రాత్మకం

ఉచిత ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి..ప్రభుత్వానికి సహకరించాలి...బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు సిద్దాంతం శ్యామల

Date : 15 December 2023 07:57 PM Views : 507

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించడం పట్ల బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు సిద్దాంతం శ్యామల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ప్రజా రవాణా వ్యవస్థలో చారిత్రాత్మకంగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల కు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం పట్ల మహిళలతో పాటు అమ్మాయిలకు రక్షణ లభిస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు గుర్తింపు కార్డును చూపించి గమ్య స్థానాలకు ప్రయాణిస్తూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రజలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్య శ్రీ పథకాన్ని పునరుద్ధరించి పది లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు స్వేచ్చగా జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆశా బావాన్ని వ్యక్తం చేసారు. మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్యామల సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :