Friday, 12 June 2026 01:35:14 AM

16లక్షల మంది విద్యార్ధుల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి...

రాష్ట్ర తెలంగాణ ఉద్యమం తరహా మరో విద్యార్ధి ఉద్యమం తద్యం... ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య ఆల్టిమేట్టం

Date : 02 December 2024 05:45 PM Views : 429

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్/ పీజీ/ డిగ్రీ తదితర కాలేజీ కోర్పులు చదువుతున్న 16 లక్షల 75 వేలమంది బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజుల బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించాలకపోతే రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తరహా మరో విద్యార్ధి ఉద్యమం తద్యం మని హెచ్చరించారు.బిసి విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిసి భవన్ లో విద్యార్ధుల సామూహిక దీక్షా నిర్వహించారు. ఈ దీక్ష రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ దీక్షలో వివిధ విద్యార్థి సంఘాలకు చెందినా నేతలు పెద్ద ఎత్తున విద్యర్థులిఉ హాజరైనారు.దీక్షకు ముఖ్య అతిదిగా విచ్చేసిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొందరు విద్యార్ధులు రక్తాన్ని-కిడ్నీలను అమ్ముకొని బకాయిలు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రియంబర్స్ మెంట్ పథకం పెట్టిన ఈ 16సంవత్సరాల సమయంలో సమాజంలో పెద్ద ఎత్తున గుణాత్మకమైన పరిణామాలు జరిగాయి అన్నారు. సమాజంలో ఇతర మార్పు తెస్తున్న ఈ స్కీము ప్రభుత్వం నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు.క ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు 4వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫీజులబకాయిలు రాకపోవడం వలన కోర్సు పూర్తి అయినవారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. సర్టిఫికెట్లు రాకపోవడంతో ఉన్నత కోర్సులలో చేరడం లేదు. అంతే కాదు ఉద్యోగాలు కూడా పొందడం లేకపోతున్నారు. ఈ దీక్ష కార్యక్రమం లో వేముల రామ కృష్ణ, సుదాకర్ ముదిరాజ్,నీల వెంకటేష్,సి.రాజేందర్,అనంతయ్య, రందావ్, నందగోపాల్ బాలయ్య రాజు,అరవింద్,,తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :