ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : గోశాలలలో ఆవులు నానా గోసలు పడుతున్నాయని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలలలో ఉండటం కన్నా రైతు వద్ద ఉబ్న్డటం స్కేమమని ఆయన అభిప్రాయపడ్డారు. గోశాలలలో ఆవులు పడుతున్న గోసలపై ఆయన చలించి పోయారు. గోశాలలో ఉన్న ఆవులకు సరైన ఆహారం దొరకక పోగా సరైన వాతావరణము ఉండదు సరైన వ్యాయామం ఉండదు ఇలా జరిగి బక్క చిక్కిపోయి చనిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతు దగ్గర ఉంటే ఆవు సుఖపడుతుంది ఆవు ఎప్పుడు పకృతిలో మమేకమై నేల మీద తిరుగుతూ నేలమీద మేయాలి కానీ ఇప్పుడు రైతుల వద్ద ఆవులు ఉండక గోశాలలో ఆవులు ఉంటూ ఎంతో ఘోష పడుతున్నాయి ఇలా జరుగుతే మనకు ఎంతో అనర్ధాలకు గురైతాము స్వాతంత్రము వచ్చినప్పుడు మన జనాభా 30 కోట్లు ఆవుల సంఖ్య 130 కోట్లు ఇప్పుడు చూసినట్లయితే మన దేశ జనాభా 140 కోట్లు ఆవుల సంఖ్య 20 కోట్లకు పడిపోయింది అందుకే వింత వింత జబ్బులు ఎన్నో ఘోరాలు జరుగుతది ఆవు ఈ సృష్టిలో పవిత్రమైన ప్రాణి మానవునితో ఎక్కువ మమేకమై సహజీవనం గడిపే జీవి ఏదైనా ఉందంటే అది పశువులు మాత్రమే పశువుల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు తెలుసుకొని పశువులను సంరక్షిస్తూ పోషించుకోవాలి ఆవులను ఎవరు కూడా హింసించరాదు ఆవులను ఎవరైతే పవిత్రంగా చూసుకుంటారో వారికి ఎన్నో రకాల లాభాలు ఆరోగ్య విషయం కాని మనశ్శాంతిగాని ఇక చెప్పుకుంటూ పోతే చాలా రకాల స్వలాభాలు ఉన్నాయి ఆవు మలమూత్రాలతో పంటలు వండిస్తే భూమి ఎంతో సారవంతమైతది ఆ భూమిల పండిన పంటలు తిన్న ప్రతివారు ఆరోగ్యవంతులవుతారు ఆరోగ్యకరమైన నవ సమాజం కావాలంటే పకృతి సిద్ధమైన పంటలు రైతుల పండించాలి ముఖ్యంగా రైతు సంక్షేమ సేవా సంఘం ముఖ్య ఉద్దేశం గోశాలలు మూతపడాలి గోశాలలో ఆవులు ఉండవద్దు ఎందుకంటే ఆవులు ఇరుకైన ప్రదేశంలో ఇబ్బంది పడుతున్నాయి చాలా మటుకు ఆవులు చనిపోతున్నాయి అంతేకాకుండా కొన్ని గోశాలలు ఆవులను కోతకు అమ్ముచున్నట్టు మాకు సమాచారం కావున ఇట్టి విషయంపై సకల జనులు ఆలోచించి గోమాతలను కాపాడాలని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు ఆవుల ప్రాముఖ్యత ఏంటంటే ఆవుల పాలు పెరుగు వెన్న తిన్నవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఆవుతో ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది వ్యాధులు వారి దరికి చేరవు ఆవు మలమూత్రాలు కూడా ఎంతో శ్రేష్టమైనవి ఆవు గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఈ పవిత్రమైన ప్రాణిని జీవిని ప్రతి ఒక్కరు కాపాడుతూ పూజిస్తూ పోషించుకోవాలని అందరికీ కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ పిలుపునిచ్చారు
Admin
Aakanksha News