ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్ ఓ ఎండ్రికాయల పార్టీ...అందులో ఎవరు చేరుతారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటామని, ప్రతిపక్ష స్థానాన్ని బలంగా పోషిస్తామని అన్నారు. నియోజకవర్గ సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే పార్టీ మారుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలను వివరించడానికి వెళ్తే ఇలాంటి అపనిందలు మోయాల్సి వస్తుందని తెలిపారు. మాకు రాజకీయ విలువలు ఉన్నాయని తెలిపారు. మెదక్ జిల్లా ఉద్యమాల గడ్డ అని ఉద్యమంలో కేసీఆర్ తోనే ఉన్నామని ఇక ముందు కూడా కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలపై దృష్టి పెట్టాలని మెదక్ పార్లమెంటుపై ఎగిరేది గులాబీ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఎప్పటికప్పుడు వాటిని ఎండాకాలం హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే వారు ఎవరూ లేరని, ఈ మాటలు అన్న వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. నా నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేగా నాకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇప్పటికే స్థానిక సమస్యలపై ఎస్పీతో పాటు కలెక్టర్ ను కలిసి విన్నవించమన్నారు. నేను బ్రతికున్నంత వరకు టిఆర్ఎస్ పార్టీని వీడేది లేదని పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రచారం అని ఈ సందర్భంగా తప్పుడు వార్తలను ఖండిస్తున్నామన్నారు.
Admin
Aakanksha News