ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : ప్రజా ప్రస్థానం పాదయాత్ర వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాములు నాయక్ తండా నుంచి షర్మిల 223వ రోజు పాదయాత్రను వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రారంభించారు.అయితే షర్మిల యాత్రను అడ్డుకుంటారన్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. పాదయాత్రలో భారీగా పోలీసులు మోహరించారు. మకుదంపూర్, చెన్నారావు పేట, ఖాదర్ పేట, ఖాదర్ పేట క్రాస్ రోడ్, జాలిశంకరమ్మ తండా, లింగగిరి, నెక్కొండ గ్రామాల మీదుగా కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4.30గంటలకు నెక్కొండ మండల కేంద్రంలో ప్రజలతో షర్మిల మాట -ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.
Admin
Aakanksha News