Wednesday, 29 July 2026 09:17:00 AM

అందరూ రావాలనేదే నా కోరిక

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్

Date : 23 April 2023 02:13 PM Views : 671

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడికి అందరూ రావాలనేదే తన కోరిక నెరవేరిందని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి తన పదవి పోతుందని భయం పట్టుకుందని విమర్శించారు. బిఆర్‌ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బు తీసుకున్నదని నిజమన్నారు. కాంగ్రెస్ పూర్తిగా బిఆర్‌ఎస్ చేతిలోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చారని బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ ఎక్కడా అనలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే ఈటెల అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత గోడవలతో రేవంత్ సతమతమవుతున్నారని దుయ్యబట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :