Tuesday, 28 July 2026 12:15:47 PM

ప్రమాదాలకు అధికారులదే పూర్తి బాధ్యత

అర్జీ-2 జిఎం కార్యాలయం ముందు మైనింగ్ స్టాప్ ప్రతినిధి బృందం ధర్నా

Date : 16 February 2023 07:19 PM Views : 521

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణిలో ప్రమాదాలకు అధికారులదే పూర్తి బాధ్యత అని మైనింగ్ స్టాప్ ప్రతినిదుల బృందం పేర్కొన్నారు. ఈ మేరకు అర్జీ-2 యైటీంక్లైయిన్ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించి జయం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జనరల్ మేనేజర్ మనోహర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు బాధ్యులు మాట్లాడుతూ... భూపాలపల్లి డివిజన్ లో డిస్మిస్ చేసిన ప్రకాష్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం డిస్మిస్ చేయడం అన్యాయమని ఈ చర్యలను యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే అధికారుల తప్పిదాలతో జరుగుతున్న ప్రమాదాలకు మైనింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాసు రామమూర్తి. బానేష్, అనిల్ మల్లారెడ్డి, శ్రీధర్ రావు, కిషన్ రావు, మహేష్,కార్తీక్, ప్రసన్న, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :