ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ఉప రాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థి గా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ను మీరే ప్రతిపాదించారా? అని ప్రశ్నించగా, ‘ఇండి’ కూటమి ప్రకటించిందని ఆయన చెప్పారు. నేనే ప్రకటించానని చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు, అవును నేనే చెప్పాను అంటే ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది కదా? అని మరో విలేకరి ప్రశ్నించగా, ‘నాకు క్రెడిట్ వద్దు, నాది డెబిట్ కార్డే..’ అంటూ చమత్కరించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగపరిరక్షుడు కాబట్టే ఇండి కూటమి ఎంపిక చేసిందన్నారు. ఈ సందర్భం గా బిసి రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడం, సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకో ర్టు ఆదేశించడం తదితర అంశాలను మీడియా ప్రస్తావించగా,రిజర్వేషన్ల విషయంలో తాము ప ట్టుదలగా ఉన్నామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టపరంగా సాధించుకోలేని పక్షంలో అన్ని పార్టీలూ నైతికంగా స్వయంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు స్వచ్ఛదంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.రిజర్వేషన్ల బిల్లుల పై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ గురించి వి వరించారు. బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశానుసారం రాష్ట్రపతి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రిజర్వేషన్లు సాధ్యం కాని పక్షంలో ఎలా? అని ప్రశ్నించగా, ఈ నెల 23న గాంధీ భవన్‌లో తమ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం (పిఏసి) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అన్నీ మీ వద్దే చెప్పేస్తే ఇక పిఏసి ఎందుకని సీఎం రేవంత్‌రెడ్డి దాట వే శారు. తమ పార్టీ తరఫున రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. మిగతా పార్టీలూ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన తెలిపారు. అ యితే చట్టపరంగా రిజర్వేషన్లు లేకుండా పార్టీలే ఇ చ్చుకుంటే ఒక సమస్య ఉంటుందన్నారు. ఒక స్థా నంలో ఒకరు బిసిని నిలబెడితే, అక్కడ ఒసి అభ్యర్థి ఉంటారని, మరో చోట ఓసి అభ్యర్థి ఉంటే అక్కడ బిసి అభ్యర్థి ఉంటారని దీంతో బిసిలకు న్యాయం జరగకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Admin
Aakanksha News