Wednesday, 29 July 2026 09:22:31 AM

జర్నలిస్టుల కేసుల్లో న్యాయ రక్షణకు ప్రత్యేక న్యాయ నిధి ఏర్పాటు చేయాలి...

ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు నారగౌని పురుషోత్తం డిమాండ్

Date : 22 November 2024 08:55 PM Views : 453

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : విధి నిర్వహణ లో జర్నలిస్టుల పై అక్రమ కేసులు విరివిగా నమోదు అవుతున్న నేపథ్యంలో కేసుల నుంచి రక్షణకు ప్రత్యేక న్యాయ నిధి ఏర్పాటు చేసి జర్నలిస్టులను ఆదుకోవాలని ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఫౌండర్ పురుషోత్తం నారగౌని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ పెద్దపల్లి జిల్లా జర్నలిస్టుల కమిటీ సమావేశం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్బంగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ, జర్నలిస్టుల రక్షణ కోసం జర్నలిస్టు రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు పరచాలని అన్నారు.. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, మరియు తప్పుడు కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చట్టం తీసుకురావాలని కోరారు.సమావేశంలో మంచిర్యాల సీనియర్ రిపోర్టర్ రాజ్ పటేల్, టీ. ఎస్. జే.యు. ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, భూపాలపల్లి నాయకులు గట్టు రవీందర్ గౌడ్ హాజరయ్యారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :