Tuesday, 28 July 2026 08:09:43 AM

రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి...

Date : 10 August 2023 05:34 PM Views : 1112

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముస్లిం, మైనార్టీలు ముట్టడించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఖభారస్థాన్ కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గతంలో గంగనగర్ లో స్థలం కేటాయించారని ఆ స్థలం సింగరేణి ఇది కావడంతో రక్షణ అధికారులు ఖభారస్థాన్ అడ్డుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఎమ్మెల్యేతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లకు తెలియజేసిన పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా తమకు ఖభారస్థాన్ కు పూర్తిస్థాయిలో స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :