Tuesday, 28 July 2026 08:09:35 AM

మద్యం మత్తులో యువకుల హాల్ చల్...

లారీ డ్రైవర్లపై బీరు సీసాలతో దాడికి యత్నం...

Date : 05 April 2023 08:36 AM Views : 1176

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మధ్యం మత్తులో కొందరు యువకులు ఈ మధ్యకాలంలో హల్ చల్ చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొందరు పోకిరిలు నడి రోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ దాడులకు దిగుతున్నారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఫైవింక్లెయిన్ లో కొందరు యువకులు మద్యం మత్తులో అర్ధరాత్రి హాల్ చల్ సృష్టించినట్లు తెలుస్తుంది. రోడ్డుపై మద్యం సేవిస్తూ అటూ వైపు నుండి వెళ్తున్న బొగ్గు లారీలను ఆపి డ్రైవర్ల పై బీరు సీసాలతో దాడికి దిగారు. నిర్మానుష ప్రాంతం కావడంతో మందుబాబులకు అడ్డాగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :