Tuesday, 28 July 2026 06:42:29 AM

ఏసీబీ వలలో అవినీతి తిమింగళం...

6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్...

Date : 28 December 2024 02:17 PM Views : 646

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఓ డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడిన సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వెన్షన్ కోసం డిప్యూటీ తహసిల్దార్ మల్లేష్ 6 వేలు లంచం డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రైతు వద్ద డబ్బులు తీసుకుంటూ ఉండగా డిప్యూటీ తహసిల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :