Tuesday, 28 July 2026 07:01:07 AM

కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం

Date : 10 October 2022 11:56 AM Views : 553

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.నాంపల్లి మండలంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా పలు గ్రామాలలో నేవ్వేలా గూడెం, చిట్టెం పాడు వడ్డేపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత కాంట్రాక్టుల కోసం, మునుగోడు ప్రజలను నిట్ట ముంచేందుకు ప్రయత్నిస్తున్నాడని, నియోజక ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు మాధవి, దామర సర్పంచ్ యాదగిరి, మండల నాయకుడు కొమ్ము బిక్షం, పానుగంటి వెంకటయ్య, కోరే కిషన్, గాదె పాక వేలాద్రి, ఎస్.కె చాంద్ పాషా, నాంపల్లి సంజీవ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :