Sunday, 26 April 2026 05:56:00 PM

కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

విప్లవ కార్మిక సంఘాల జేఏసీ

Date : 10 November 2022 11:07 PM Views : 346

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : దేశంలో కార్మిక రంగాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు రియాజ్ అహ్మద్, ఐకృష్ణ, విశ్వనాధులు ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కార్మిక సంఘాల్లో ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని వారు పేర్కొన్నారు.ఈనెల 12న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ ఎఫ్ సి ఎల్ ని జాతికి అంకితం చేయడానికి రావడం రాజకీయ పబ్బం గడుపు కావడానికే అని వారు విమర్శించారు. 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రంగానికి చేసింది ఏమీ లేదని అనేక పరిశ్రమలను మూసివేసి ప్రైవేటుపరం చేసిందన్నారు. కార్మిక రంగాన్ని ఒకవైపు బ్రష్టు పట్టిస్తూ మరోవైపు ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం అంటూ వస్తున్న ప్రధాని పర్యటనలు అడ్డుకుంటామని నిరసనలు తెలుపుతామని అన్నారు.కొన్ని అవకాశవాద కార్మిక సంఘాలు తమ అవకాశాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉండడంతో కార్మిక సంఘాల్లో ఉన్న అనైక్యతను కేంద్ర ప్రభుత్వం ఆసరాగా చేసుకొని కార్మిక రంగంపై వేటు వేయడానికి సిద్ధమైందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు లక్షల పరిశ్రమలను మూసి వేయడమే కాకుండా కొన్నిటిని ప్రైవేటుపరం చేయడం జరిగిందన్నారు. సింగరేణి విద్యుత్ బోర్డ్ ఇతరాత్ర పరిశ్రమలను సైతం ప్రైవేటుపరం చేయాలనే కుట్రలతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తమ నిరసన వ్యక్తం చేస్తామన్నారు. పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీ ఆర్ ఎఫ్ సి ఎల్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అవినీతిపై ఉద్యోగాలు పెట్టిస్తామని చేసిన మోసంపై తమ చేతుల్లోని సిబిఐకి అప్పగించాలని వారు నరేంద్ర మోడీకి డిమాండ్ చేశారు. జరిగిన ఈ అవినీతిని మోడీ ప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయల దండుకున్న టిఆర్ఎస్ నాయకులు,ఎమ్మెల్యేలు. ఎంపీలపై చర్యలు తీసుకోవాలని విప్లవ సంఘాల జేఏసీ నాయకులు మోడీని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రియాజ్ అహ్మద్ కృష్ణ విశ్వనాధులతోపాటు జైపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :