Tuesday, 28 July 2026 12:34:12 PM

రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి అసలు వారికి చిత్తశుద్ధి లేదు...

తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్సే. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

Date : 20 August 2025 05:34 PM Views : 550

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆత్మప్రబోధన ఏమైందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రశ్నించారు.ఇండీయ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించారని,ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు, తెలంగాణ బీసీ వర్గానికి చెందిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని మాట్లాడారని. మరి అప్పుడు వారి ఆత్మప్రబోధన ఏమైందన్నారు. బుదవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మేదిఉయా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదు?కాంగ్రెస్ పార్టీలోని, ఇండీయ కూటమి ఎంపీలందరూ ఇప్పటికైనా ఆత్మప్రబోధన చేసుకుని, ఎన్డీయే ప్రకటించిన ఎంబీసీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గారికి ఓటు వేయాలని కోరారు. అప్పుడే నిజమైన బీసీలకు న్యాయం జరుగుతుంది.రేవంత్ రెడ్డికి “భాస్కర్ అవార్డు – గోబెల్స్ ప్రైజ్” అన్నారు కదా. మరి ఇప్పుడు ఆత్మప్రబోధన ఎందుకు గుర్తుకు రాలేదు? ఆయన ఆత్మప్రబోధన చేసుకుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వి. హన్మంతరావు పేరు ప్రకటించాల్సింది కదా?కాంగ్రెస్ పార్టీకి కేవలం బీసీ ఓట్లు మాత్రమే ముఖ్యం. కానీ రిజర్వేషన్ల విషయంలో వారికి చిత్తశుద్ధి అసలు లేదు.భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, ఐక్యత కోసం పనిచేసే పార్టీ.ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేది చట్టం. అంతేకాని ఎవ్వరినీ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలనడం సరికాదు. మనమంతా భారతీయులమే.దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఎవరైనా ఇక్కడ నివసించడానికి హక్కు ఉంది. అంతేకాని “మార్వాడీ గో బ్యాక్” అనే నినాదాలు మంచివి కావు.ఈ నినాదాల వెనుక, చర్యల వెనుక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయి. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు బలం చేకూరుస్తున్నారు.నేడు తెలంగాణలో శాంతి-భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది.తెలుగు ప్రైడ్ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ… గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవం చూపకుండా, తెలుగు వారైన వెంకయ్య నాయుడి మద్దతు ఇవ్వలేదు. అందుకు బదులుగా వేరొకరికి సపోర్ట్ చేసింది.నిజంగా తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్సే అని విమర్శించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :