Tuesday, 28 July 2026 06:55:33 AM

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

Date : 08 July 2023 05:48 PM Views : 522

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మతో మండల కేంద్రం నుండి బస్టాండ్ వరకు శవ యాత్ర చేసి అంబేద్కర్ బొమ్మ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు భాద్యులు మాట్లాడుతూ...పార్లమెంట్ లో రాహుల్ గాంధీ.. అదాని, ప్రధాని నరేంద్ర మోడీల చీకటి ఒప్పందాన్ని బయటకు తెచ్చి పార్లమెంటులో కార్పొరేట్ వ్యవస్థకు దేశాన్ని తాకట్టు పెట్టద్దు అని వాదించారని పేర్కొన్నారు.దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేయద్దని,కుల మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులపై రాహుల్ గాంధీ గళం ఎత్తి వినిపించడం తో పార్లమెంటులో గొంతు విప్పద్దని కక్షపూరితంగా కార్పొరేట్ ప్రభుత్వమైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ కనసన్నాల్లో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసారని అన్నారు.ఎట్టి పరిస్థితిలో రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాన మంత్రి పదవిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆరు సంవత్సరాలు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా వారి పై ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు పెట్టించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :