Tuesday, 28 July 2026 08:09:34 AM

శరీర దానంకు ముందుకు వచ్చిన సీనియర్ జర్నలిస్ట్..!

జిల్లా కలెక్టరుకు అంగీకార పత్రం అందజేత - అభినందించిన జిల్లా కలెక్టర్

Date : 17 October 2023 08:45 PM Views : 598

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖనికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కే.ఎస్.వాసు తన మరణానంతరం శరీరాన్ని రామగుండం సిమ్స్ మెడికల్ దానం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం గోదావరిఖనిలోని ప్రభుత్వ సిమ్స్ మెడికల్ కాలేజీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసు తన మరణానంతరం పార్థివ దేహాన్ని రామగుండం సిమ్స్ మెడికల్ కాలేజీ ఇస్తానని ప్రత్యేక ఫార్మాట్ రూపంలో అంగీకార పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. వాసు తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. సిమ్స్ మెడికల్ కాలేజీకి సీనియర్ జర్నలిస్ట్ వాసు ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు డెడ్ బాడీలు రావడం జరిగిందని ప్రిన్సిపాల్ హిమబిందు సింగ్ కలెక్టర్ కు వివరించగా, కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని, తమ సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :