Tuesday, 28 July 2026 10:54:50 AM

కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరుపాలి...

ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి

Date : 18 April 2025 06:52 PM Views : 726

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది అని కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నారు.హెచ్‌సీయూలో జరిగిన విధ్వంసం విషయంలో మోదీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హెచ్‌సీయూలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధాని మోదీ మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం అని కాంగ్రెస్‌ చేసిన ఆర్థిక మోసంపై ఇప్పటికే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, సీబీఐ, ఆబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐఓలకు ఆధారాలతో సహా తెలియజేశాం అని తెలిపారు. ఆర్థిక అవకతవకలు జరిగినట్టు కేంద్ర సాధికార కమిటీ కూడా నిర్ధారించిందని . స్వతంత్ర విచారణ చేయాలని కేంద్ర సాధికార కమిటీ సూచించిందన్నారు. ఆర్థిక అక్రమాలపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. నిస్సిగ్గుగా, అక్రమంగా పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్‌ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కంచ గచ్చిబౌలిలో రూ.10 వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రధానిగా పర్యావరణ పరిరక్షణ, నిర్వహణపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటి కాదని, కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :