ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం పట్ల బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమైన చర్య అని అన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని.. తొలగించలేదని దాసోజు శ్రవణ్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీగానీ.. కేసీఆర్ ప్రభుత్వం గానీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అని మండిపడ్డారు. జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విగ్రహం ధ్వంసం చేసిన చోటులో మళ్లీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లను ఆయన కోరారు.
Admin
Aakanksha News