Wednesday, 29 July 2026 11:15:04 AM

ప్రజాపాలన ప్రభుత్వంలో... ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు..

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ... వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Date : 23 November 2024 11:34 AM Views : 729

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హన్మకొండ జిల్లా : ప్రజా పాలన ప్రభుత్వంలో... ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని 43వ డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) సంబందించి 7 గురు లబ్ధిదారులకు సుమారు 1 లక్షల 98 వేల రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు చేతుల మీదుగా పంపిణీ చేసారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు.ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఈద్దుర్ల అరుణ విక్టర్ డివిజన్ అధ్యక్షుడు చింత ప్రకాష్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :