ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నియోజకవర్గం స్థాయిని మొదలుకొని రోజుకొ నేత పరస్పర విమర్శలు, రాజీనామాలతో తెర మీదకు వస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తమను కలుపుకొని వెళ్లకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలు నాయకులు క్రమంగా వారి స్వరం పెంచుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేనే లక్ష్యంగా బహిరంగ ఆరోపణలు విమర్శలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న కొంత మంది నేతలు టికెట్ ను ఆశించారు.ఈ నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీకి పదవులకు రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తున్నారు. అయితే ఎక్కడ లేని విధంగా రామగుండంలో రాజకీయాలు ఈటెక్కుతున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే సొంత పార్టీ నేతలు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆసంతృప్తి బయటపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రామగుండం నియోజకవర్గంలో రాజకీయాలు అందుకు భిన్నంగా కొనసాగుతున్నాయి. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని.. కేవలం ప్రకటనలకే మహిళా హక్కుల చట్టాలు పరిమితమయ్యాయని విమర్శిస్తూ పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాలకుర్తి, అంతర్గంతో పాటు మరికొన్ని చోట్ల పట్టుకున్న సంధ్యారాణి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో వైపు ఆసంతృప్తిగా ఉన్న మరి కొంత మంది నాయకులను కార్యకర్తలను కలుపుకొని ఇప్పటికే తన కార్యాచరణను సిద్ధం చేస్తున్న సంధ్యారాణి అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ తన మద్దతును కూడా కట్టుకుంటుంది. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలో ఉంటున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి.గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన సోమారపు సత్యనారాయణ సైతం ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఓట్లను చేర్చే అవకాశాలు లేకపోలేదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా అధికార పార్టీకి చెందిన కొంతమంది అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉండడంతో రామగుండం రాజకీయాల్లో కలవరం మొదలవుతుంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా అధికార పార్టీకి మాత్రం గట్టి పోటీ ఇస్తూ ఓట్లను చీల్చే అవకాశం ఉండడంతో ఈ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు నెలకొంటున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల్లో రామగుండం రాజకీయాలు ఎటువైపు మలుపు తిరుగుతాయో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే..
Admin
Aakanksha News