Friday, 12 June 2026 12:40:29 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్

Date : 11 April 2023 06:10 PM Views : 1742

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లిలోని సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించి 60 వేలు లంచం తీసుకుంటుండగా సబ్‌ రిజిస్టార్‌ దేవనగిరి నిర్మల, అటెండర్‌ శ్రీనివాసులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య నేతృత్వంలో జరుగుతున్న ఈ దాడుల్లో సీఐ ఎస్‌ పి రవిందర్‌ తో పాటు పలువురు ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడిన సబ్‌ రిజిస్ట్రార్‌,అటెండర్‌ లకు కెమికల్‌ టెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :