Tuesday, 28 July 2026 07:30:39 AM

రూ. 8,440 కోట్ల బడ్జెట్ కు జిహెచ్ఎంసి కౌన్సిల్ ఆమోదం...

Date : 30 January 2025 04:34 PM Views : 395

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం ప్రారంభంకాగానే క్వశ్చన్ అవర్ చేపట్టాలని బిఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో రసభాసంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బడ్జెట్ పై జిహెచ్ఎంసి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బిఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్‌ పోడియం చుట్టుముట్టి కాగితాలు చించి విజయలక్ష్మిపై విసిరేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బిఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను మార్షల్స్‌ అడ్డుకున్నారు. బిఆర్‌ఎస్ కార్పొరేటర్లను మేయర్ విజయలక్ష్మీ సస్పెండ్ చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి 2025- 26 ఆర్థిక సంవత్సరానికి గాను పద్దు ప్రవేశపెట్టనున్నారు. రూ. 8,440 కోట్ల బడ్జెట్ కు జిహెచ్ఎంసి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రేపు బడ్జెట్ పై చర్చలు జరుపనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :