ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అర్హత కలిగిన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని CPI ML ప్రజాపంథా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అంతర్గాం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.అదే విధంగా రైతులందరికీ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అనేది బూటకం అని అది కేవలం ప్రచారం కోసమే తప్ప రైతులకు ఇచ్చింది లేదని అన్నారు. విద్యుత్ లేక మోటార్లు పనిచేయక, మోటార్లు కాలిపోతూ రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. RFCL లో ఉద్యోగాల కోసం డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో CPI ML ప్రజాపంథా పెద్దపెల్లి జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, అడేపు శంకర్, పెండ్యాల రమేష్, కట్ట తేజేశ్వర్, భూషవేణి కృష్ణ, నస్పూర్ లక్ష్మి, గొల్లపల్లి చంద్రయ్య ఆలకుంట ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News