Sunday, 26 April 2026 05:59:08 PM

మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోరుకంటి

అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

Date : 03 May 2023 10:48 AM Views : 1331

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఏర్పాట్లను నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. ఉద్యమాల ఖిల్లాగా పేరుపొందిన రామగుండం నియోజకవర్గానికి ఈ నెల 8వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని తెలిపారు. అయితే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని అన్నారు. అయితే ఎంతో మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఐటీ, ఇండస్ట్రియల్ పార్కు, నూతన పోలీస్ కమిషనరేట్ భవనంతో పాటు పలు కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :