Tuesday, 28 July 2026 05:56:30 AM

వివాదాస్పదమవుతున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలు..

Date : 22 December 2022 01:16 PM Views : 618

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చేసిన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారం గా మారాయి. ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమయ్యింది అని, వైద్యులు, మెడిసిన్ వల్ల కాదని చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆయనపై మండిపడుతున్నాయి. బాధ్యతాయుతమైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ పదవిలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూపరిషత్తు తెలంగాణ శాఖ మండిపడింది. హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా.. హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదంటున్నాయి హైందవ సంఘాలు. ప్రభుత్వ ఉద్యోగి అయిఉండి.. వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఓ మతం వారిని కించపరిచే విధంగా మాట్లాడిన శ్రీనివాస్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విశ్వహిందూపరిషత్తు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిచకుంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :