ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని పోలీసులు విచారణ అనంతరం కొడంగల్ కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరిచారు. కోర్టు నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. లగచర్ల ఘటనలో కలెక్టర్ పై దాడికి కుట్ర చేశారన్న అభియోగాలపై నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు హైదరాబాద్ కెబిఆర్ పార్కు వద్ద అరెస్టు చేశారు. వికారాబాద్ డిటిసి కార్యాలయంలో ఎస్‌పి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విచారించారు.అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టుకు తరలించగా కోర్టు 14రోజుల రిమాండ్ విధించగా, పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, కోర్టుకు తరలించే క్రమంలో నరేందర్ రెడ్డి అక్కడ ఉన్న మీడియాను చూసి తన అరెస్టు అక్రమమని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి తన పరువు నిలుపుకునే క్రమంలో లగచర్లలో జరిగిన ఘటనను బిఆర్‌ఎస్ పార్టీకి ఆపాదించి కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని వెల్లడించారు.
Admin
Aakanksha News