Tuesday, 28 July 2026 05:58:54 AM

బాల్క సుమన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు....

టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

Date : 06 February 2024 12:27 PM Views : 483

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హెచ్చరించారు. చెప్పులతో కొట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే గులాబీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఫ్రస్టేషన్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే నేతలను తన్ని తరిమేసే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. 10 సంవత్సరాలు తెలంగాణను పాలించింది ఇలాంటి చిల్లర గాళ్లా అని ప్రశ్నించారు. ఈ చిల్లరగాళ్ల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అండ్ టీం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. రెచ్చగొట్టే మాటల ద్వారా తమను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని తమ ప్రభుత్వం బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయటికు తీస్తుందని హెచ్చరించారు. గులాబీ నేతలు విద్వేషం, విషం చిమ్మే పనులు చేస్తున్నారని.. వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ బలుపుతోనే బీఆర్ఎస్‌ను ఎన్నికల్లో ఓడించారని, ఇప్పటికైనా కేటీఆర్ అండ్ టీం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :