ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : తెలంగాణాలో నూతన రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో మంది ప్రజలు గత పదేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా సోషల్ మీడియాలో రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న ప్రజల ఆశలతో చేలగాటమాడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఏ నేపథ్యంలోనే తెలంగాణాలో మరో సరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఒక్క ప్రకటన విడుదల అయింది. ఈ నూతన దరఖాస్తులను మీసేవ లో చేసుకోవాలని ప్రభుత్వం తరఫున ఒక్క లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ సెంటర్లకు బారులు తీరారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఎటు వెబ్ సైట్ ఓపెన్ కాకపోవడం, రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి సమాచారం మీసేవలో లేకపోవడంతో ఇటు ప్రజలు, మరో వైపు మీసేవ నిర్వాహకులు అయోమయానికి గురవుతున్నారు. ఇదంతా ఇలా ఉంటె మరో వైపు కొద్దీ సేపటికే సోషల్ మీడియాలో మరో ప్రచారం తేరా మీదకు వచ్చింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు ఈసీ బ్రేక్ అంటూ ప్రచారం మొదలైంది. ఈ విధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎన్నికల సంఘం ఖండించింది. రేషన్ కార్డుల జారీని ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈసీ తోసిపుచ్చింది. రేషన్ కార్డుల అంశంపై సివిల్ సప్లయ్స్, మీసేవ మమ్మల్ని సంప్రదించలేదని ఈసీ వెల్లడించింది.
ప్రభుత్వం పేరుతో విడుదల ఐన లేఖ నిజమైనదేనా....?
తెలంగాణాలో నూతన రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేరుతో సోషల్ మీడియాలో ఒక్క లేఖ వైరల్ అవుతుంది. అయితే నూతన రేషన్ కార్డు కోసం ప్రజలు మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేరుతో విడుదల ఐన ప్రకటనలో ఉండటంతో అందరు ఇది నిజమైనదే కావచ్చు అని ప్రజలు నమ్మరు. మల్లి కొద్దీ సేపటి క్రితమే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నూతన రేషన్ కార్డుల ప్రక్రియకు బ్రేక్ వేసిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇలా పూటకో ప్రకటనతో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఎన్నికల కమిషన్ రేషన్ కార్డుల ప్రక్రియపై మాకు ఎటువంటి సంబంధం లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. అయితే ప్రభుత్వం పేరుతో విడుదల ఐన లేఖ అసలు నిజమైనదా...? కాదా..? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మరి విడుదల ఐన లేఖపై ప్రభుతం ఎందుకు సమాధానం చేప్పలేకపోయిందని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ప్రచారం కావాలనే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Admin
Aakanksha News