Tuesday, 28 July 2026 10:47:08 AM

అక్రమణ దారుడిపై చర్యలు తీసుకోవాలి

ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య డిమాండ్

Date : 10 August 2023 02:08 PM Views : 1062

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ లో ఉన్న బందెల దొడ్డి, నైట్ షెల్టర్ ఆక్రమణకు గురికావడం జరిగిందని వెంటనే వీటిని మున్సిపల్ శాఖ స్వాధీన పరచుకొని ఆక్రమణదారునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నగరపాలక సంస్థ కమిషనర్ కు అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రామగుండం నగర సమితి ఆధ్వర్యం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య మాట్లాడుతూ "రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ లో అధికార పార్టీ నేత, కార్పొరేటర్ ఆ డివిజన్ పరిధిలో గల బందెల దొడ్డిని ఆక్రమించుకొని తన కారు పార్కింగ్ కోసం వాడుకోవడమే గాక మొదటి పాలకవర్గం నిర్మించిన నైట్ షెల్టర్ కి గ్రంథాలయం అని బోర్డు తగిలించి దాన్ని తన సొంత కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. సంవత్సరం క్రితం పాత మున్సిపల్ కార్యాలయంలో స్క్రాప్ దొంగతనం జరిగిన లక్షల రూపాయల అవినీతి జరిగిన ఇప్పటి వరకు ఆ విచారణలో పురోగతి లేదని మళ్లీ అదే డివిజన్ లో బందెల దొడ్డి, నైట్ షెల్టర్ ఆక్రమణకు గురి కావడం అధికార పార్టీ నేతల ఆగడాలకు నిదర్శనమని అన్నారు. తాము అధికారంలో ఉన్నామని ప్రజలకు మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులను తమ వ్యక్తిగత ఆస్తులుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బందెల దొడ్డి, నైట్ షెల్టర్ ని అక్రమ దారుని చెర నుండి మున్సిపల్ శాఖ స్వాధీన పరుచుకొని అక్రమదారుడిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆసాల నవీన్, రణవేని సుధీర్ కుమార్ దబ్బేటి గోపీ కృష్ణ ఉన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :