ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : ప్రజలు కన్నీళ్లతో ఉంటే ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటుందని CPI ML ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు జిందం రాంప్రసాద్, తోకల రమేష్ లు విమర్శించారు.ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ దివస్ పేరుతో CPI ML ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుందని ప్రజలు కన్నీళ్లతో ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్క మంత్రి గాని ఎమ్మెల్యే గాని ప్రభుత్వం గాని వెళ్ళిన దాఖలాలు లేవని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజంగా నెరవేర్చితే ఉస్మానియా గడ్డపై ఉత్సవాలు ఎందుకు నిర్వహించడం లేదని వారు ప్రశ్నించారు. నిరుద్యోగం విలయతాండవం చేస్తుంటే, ప్రజలంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ప్రశ్నించే గొంతులను తెలంగాణ ప్రభుత్వం అణుగదొక్కుతుంటే ఈ ఉత్సవాలు ఎవరి ప్రయోజనం కోసం అని దీనిని ప్రజలంతా ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రజాసోమ్ముతో ప్రభుత్వం వారి సొంత ప్రచారం కోసం ఉత్సవాలను వాడుకుంటూ ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. నీళ్లు నియామకాలు పేరుతో కొనసాగిన ఉద్యమం నేటికీ అదే విధంగా ఉన్న పరిస్థితి ఉందని. తెలంగాణ భౌతికంగా ఏర్పడిందే తప్ప ప్రజల ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదని ఆరోపించారు. ప్రజలంతా మరోదశ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఆడెపు శంకర్, కోడిపుంజుల లక్ష్మి, మార్త రాములు, బత్తుల అనిల్, రాజు, కట్కూరి ఏనోస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News