Tuesday, 28 July 2026 10:47:40 AM

డ్రైవర్ అక్రమాలపై విచారణ చేపట్టాలి...

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డి ఎం ఈ, జిల్లా కలెక్టర్ ను లేఖ ద్వారా కోరిన సిపిఐ.

Date : 24 January 2023 07:15 PM Views : 1614

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతన మెడికల్ సూపరింటెండెంట్ ను నియమించాలని, ప్రస్తుతం ఆసుపత్రిలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వహిస్తూ, ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందిని అనేక వేదింపులకు గురిచేస్తూ పెత్తనం చేలాయిస్తున్న ప్రిన్సిపాల్ ను వెంటనే బదిలీ చేసి నూతన మెడికల్ సూపరింటెండెంట్ ను నియమించాలని సిపిఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినెష్ లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, డి ఎం ఈ, జిల్లా కలెక్టర్ కు లేఖ ద్వారా ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందిని మానసిక వేదింపులకు గురిచేస్తున్న మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో (టివివిపి) తరుపున మెడికల్ సూపరింటెండెంట్ ను నియమించి ఆసుపత్రి నిర్వహణను చూసుకునే వారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిని మెడికల్ కళాశాలగా ఏర్పాటు చేయడం వల్ల (టివివిపి) నుండి (డి.ఎం.ఈ) పరిధిలోకి మార్చినందున ఆసుపత్రికి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ యెక్క భర్త మెడికల్ సూపరింటెండెంట్ గా ఉన్నప్పటికీని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ గా పెత్తనం కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు. మెడికల్ కళాశాల కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి బాధ్యతలు కూడా ప్రిన్సిపాల్ చూసుకోవడం వల్ల ప్రిన్సిపాల్ ప్రోత్సహంతో వారి ముఖ్య అనుచరుడైన ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్న డ్రైవర్ ఆస్పత్రిలో ఇష్టానుసారంగా ప్రిన్సిపాల్ అండదండలతో అనేక దందాలకు దిగి, ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందిని అనేక అవస్థలు పెడుతూ వేదింపులకు గురిచేస్తూ పెత్తనం చేలాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అదే విధంగా ఆసుపత్రిలో, మెడికల్ కళాశాల లో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకుంటూ నిరుద్యోగుల వద్ద ఆర్థిక దోపిడి కి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.దీని వల్ల స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చిన వారికే ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తన డ్రైవర్ ను అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బంది, అధికారులు కోడై కూస్తున్నారని వారు విమర్శించారు. అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పై తగు విచారణ జరిపి బాధ్యతల నుంచి తొలగించి నూతనంగా మెడికల్ సూపరింటెండెంట్ ను నియమించాలని, డ్రైవరే సూపరిండెంట్ లా వ్యవహరిస్తున్నారని కావున డ్రైవర్ పై విచారణ చేసి, యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రికి ప్రిన్సిపాల్ కి సంబంధం లేకుండా వారిని బదిలీ చేయాలని ఆయన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :