ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జోగులంబ గద్వాల జిల్లా : బాలుడికి నిర్లక్ష్యంగా వైద్యం చేసిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలోని రెయిన్ బో హాస్పిటల్ లో ఫెవికిక్ తో ప్రణవ్ అనే బాలుడికి కుట్లు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ సిద్ధప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్రవంతి, జిల్లా ఆస్పత్రి స్పెషలిస్టు డాక్టర్ శ్యామ్, పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విష్ణు కలసి బాలుడికి చికిత్స అందించిన ఆస్పత్రిలో విచారణ చేపట్టి సీజ్ చేసినట్లు వారు తెలిపారు. అనంతరం బాలుడి ఆరోగ్య పరిస్థితిని తన తండ్రిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఓ తిరుమల రెడ్డి, మాస్ మీడియా అధికారి కోట్ల మధుసూదన్ రెడ్డి, పీహెచ్ సీ ఎం పి హెచ్ ఓ ఓబులేశ్వరయ్య పాల్గొన్నారు.
Admin
Aakanksha News