Tuesday, 28 July 2026 06:34:56 AM

గాంధీ భవన్ లో ప్రజా విజయోత్సవ సంబరాలు..

రేవంత్ రెడ్డి కీ అండగా ఉందామని మెట్టు సాయి కుమార్ పిలుపు

Date : 03 December 2024 07:44 PM Views : 487

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పాలనకు నేటి తో ఏడాది పూర్తి అయిన సందర్బంగా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ఘనంగా ప్రజా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ నేటికీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది పూర్తి అని,నియంత పాలన నుండి ప్రజా పాలనకు వచ్చిన రోజు అన్నారు.ప్రజలు ప్రజా పాలనను ఆమోదించిన రోజు అన్నారు.నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను, ప్రజా సంఘాలను హక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ..దశబ్ద కాలం పాటు అణిచివేయబడిన ప్రజాసంఘాలకు స్వేచ్చ కల్పించిన రోజు....ఈ రోజును తెలంగాణ ప్రజలు మరచిపోలేని రోజు....ఈ రాష్టం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి కీ అండగా ఉందామని పిలుపు నిచ్చారు....కులగణన ఈ దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రము లో మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంటుందన్న ధీమా వ్యక్తం చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :