ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : చంద్రబాబు నాయుడు హయాంలో పోయిన సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం 2వ ఇంక్లైన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాసిన ఘనత కాంగ్రెస్, బీజేపీ పార్టీలది అని విమర్శించారు. సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయడానికి కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా కేంద్రంతో కోట్లాడి కార్మికుల హక్కులను కాపాడి కార్మికుల హక్కుల ప్రయోజనాల కోసం ఎన్నో పథకాలు తీసుకవస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటూ కార్మికుల హక్కులు కలరాస్తున్నారని విమర్శించారు.
Admin
Aakanksha News