Tuesday, 28 July 2026 01:34:54 PM

ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప, రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దడం చేతగాదా..

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్

Date : 21 July 2025 08:06 PM Views : 436

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజురోజుకీ దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మనస్సు కరగడం లేదా అని నిలదీశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఇలా 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని విమర్శించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :