ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లాలో వరుసగా జరుగుతున్న ఏసీబీ అధికారుల దాడులు సంచనాలు సృష్టిస్తున్నాయి. అంతర్గం తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు మరువకముందే పెద్దపల్లి పట్టణంలో మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కడం చర్చనీయాంశంగా మారుతుంది. వివరాల్లోకి వెళ్తే...ఎస్సారెస్పీ నీటిపారుదుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు కాంట్రాక్టర్ వద్ద నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ వద్ద రోడ్డుపైన డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు తీసుకువచ్చి విచారిస్తున్నారు.
Admin
Aakanksha News