ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం లో ప్రజల అభివృద్ధి కోరుకునే వారిని ఆదరించాలని అవినీతిపరులను తరిమివేయాలని ఆదివారం మాజీ టిఎస్ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సోమవారపు సత్యనారాయణ పిలుపు నిచ్చారు. గోదావరిఖని సీతా నగర్ కూరగాయల మార్కెట్ లో వ్యాపారస్తులతో కలసి తిరుగుతూ వారి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమరపు మాట్లాడుతూ... రామగుండం నియోజకవర్గంలో తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి చేశానో మీ అందరికీ తెలుసు అని అన్నారు. ఈ కూరగాయల మార్కెట్ తో పాటు మున్సిపల్ కార్యాలయం షాపింగ్ కాంప్లెక్స్ ఇలా అనేక అభివృద్ధి పనులు చేయడమే కాకుండా 24 గంటలు మంచినీటి సరఫరా చేసిన ఘనత తనకే దక్కిందని పేర్కొన్నారు. మరో సారి ప్రజలు తనను ఆదరించారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ప్రస్తుతం అవినీతి మయంగా మారి ప్రజలను ఉద్యోగాల పేరుతో దోచుకుంటున్న నేతలను తరిమికొట్టి అభివృద్ధి చేసే నాయకులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే రామగుండం అభివృద్ధి అనేక సంవత్సరాలు వెనక పోయిందని తిరిగి అవినీతిపరులకు ఆశ్రయం కల్పిస్తే అభివృద్ధికి రామగుండం నోచుకోకుండా పోతుందని ఆయన ప్రజలకు సూచించారు. అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీతో అభివృద్ధి సాధ్యం జరుగుతుందన్నారు. అనంతరం ఓల్డ్ అశోక్ షాప్ సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ప్రజలతో కలిసి కాలక్షేపం చేస్తూ టిఫిన్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దుబాసి మల్లేష్ నాయకులు మంచి కట్ల బిక్షపతి రాచకొండ కోటేశ్వర్లు పిడుగు కృష్ణ సోమారపు అరుణ్ కుమార్ తదితరులున్నారు.
Admin
Aakanksha News